Buchi Babu: పడిపోయినా లేచిన మనిషి కథే ‘పెద్ది’.. డైరెక్టర్ బుచ్చిబాబు కథపై హింట్ ఇచ్చేసాడుగా!

Buchi Babu: పడిపోయినా లేచిన మనిషి కథే ‘పెద్ది’.. డైరెక్టర్ బుచ్చిబాబు కథపై హింట్ ఇచ్చేసాడుగా!

‘ఉప్పెన’ మూవీతో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు.. ‘పెద్ది’తో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్లో చేరనున్నారు. ముఖ్యంగా బుచ్చిబాబు కథ చెప్పే విధానం, ఆయన టేకింగ్‌లోని ఫ్రెష్‌నెస్, భావోద్వేగాలను బలంగా తెరపై చూపించే సామర్థ్యం.. ఇవన్నీ పెద్దిని బాక్సాఫీస్ బరిలో సత్తా చాటేలా చేయనున్నాయి. సినిమా మొదటి నుంచి పెద్ది కథపై, రామ్ చరణ్ నటనపై బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు.

ఇదే సమయంలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా వేళా రెట్లుగా తన స్పీచ్ ఉండటంతో పెద్దిపై మరిన్ని అంచనాలు పెరిగాయి. బుచ్చి అనుకున్నట్టుగా జరిగితే, ఇండియన్ సినిమా దర్శకత్వ చరిత్రలో అత్యంత వేగంగా పాన్-వరల్డ్ డైరెక్టర్ రేంజ్‌కి ఎదిగిన అతికొద్ది మంది దర్శకులలో ఒకరిగా నిలిచిపోవడం ఖాయం.

పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా..

‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సినిమాపై తనకున్న నమ్మకాన్ని మరోసారి చాటుకున్నారు. ‘ఉప్పెన’ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకోవడానికి కారణం ‘పెద్ది’ కథేనని చెప్పిన ఆయన, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని వెల్లడించారు. రామ్ చరణ్ తన కథను ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఓకే చేశారని, రెండో సినిమా దర్శకుడిని నమ్మి రూ.350 కోట్ల భారీ ప్రాజెక్ట్ ఇవ్వడం సాధారణ విషయం కాదని ఎమోషనల్ అయ్యారు.

పెద్ది కమర్షియల్ సినిమా కాదు. ఇది ఒక ఆటగాడి కథ. ఊరికి గౌరవం తెచ్చేపట్టే కథ. చుట్టూ ఉన్నవాళ్లందరినీ మార్చేసే కథ. ముఖ్యంగా అలలా ఎగిసి పడిపోయినా మనిషి కథ కాదు. పడిన లేచినా మనిషి కథ అని వివరించారు. అంతేకాదు, సినిమా అవుట్‌పుట్‌పై బుచ్చిబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను ఇప్పటికే 50 నుంచి 100 సార్లు సినిమా చూసినా, సెకండ్ హాఫ్‌లో చివరి 40-50 నిమిషాలు ప్రతిసారీ ఎమోషనల్ అవుతానని చెప్పారు.

కథపై హింట్ ఇచ్చేసారా?

పెద్ది సెకండాఫ్ లో వచ్చే ‘‘ఢిల్లీ ఎపిసోడ్‌ సినిమాకు ఎమోషనల్ పార్ట్ అని రీసెంట్ గా చరణ్ సైతం చెప్పుకొచ్చాడు. ‘పెద్ది’ సినిమా మొత్తంలో ఎక్కువ మలుపులు ఉండేది ఆ ఎపిసోడ్‌లో అని చెర్రీ ట్విస్ట్ ఇచ్చాడు. ఇన్నాళ్లు కుస్తీ బరిలో, క్రికెట్ గ్రౌండ్ లోనే అసలు రచ్చ అనుకున్నారు అందరూ. కానీ, ఉప్పెనలో ట్విస్ట్‌ కంటే 100రెట్లు ఎక్కువ ఉంటుందని ’’ అని రీసెంట్ కారు జర్నీ వీడియోలో చరణ్  చెప్పడంతో పెద్దిపై క్యూరియాసిటీ పెరిగింది.

ఒక స్టార్ హీరోకి అలాంటి ట్విస్ట్ పెట్టడం చాలా అరుదు సార్. కానీ, ఆ ట్విస్టుతోనే 50 రేట్లు హీరోయిజం కనిపిస్తుంది అని బుచ్చిబాబు చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది. అలాగే, పెద్దిగాడు ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నాడు.. అసలు క్రాస్ ఓవర్ అథ్లెటిక్స్ అంటే ఏంటో ఏంటనేది సినిమా మెయిన్ ఎమోషనల్ పాయింట్ అనేది సస్పెన్స్. 

రామ్ చరణ్ నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుందని, ఒక స్టార్ హీరో ఇలాంటి కథని సెలెక్ట్ చేయడం మాములు విషయం కాదు. రామ్ చరణ్ గారికి ఋణపడి ఉంటాను అని బుచ్చి ఎమోషనల్ అయ్యారు. జగపతి బాబు పోషించిన ‘అప్పలసూరి’ పాత్ర కూడా హృదయాలను కదిలిస్తుందని పేర్కొన్నారు. ఎన్నో కలలతో రాసుకున్న కథని , ఎంతో పట్టుదలతో తెరకెక్కించిన మనిషి.. అంతే అనుకువగా స్పీచ్ ఇవ్వడంతో ‘పెద్ది’పై జెన్యూన్ అభిప్రాయం కలిగిందని అంటున్నారు ఫ్యాన్స్.