రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. సోమవారం బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘నా జీవితంలో చేసిన మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఫిల్మ్ ఇది.
శివన్నతో కలిసి పనిచేయడం నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా’ అని అన్నాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని జాన్వీ కపూర్ చెప్పింది. శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సినిమాతో ఆయనకి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని నమ్ముతున్నా.
ఈ చిత్రంలోని బలమైన ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు. ఇదొక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా అని, అయినా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని నిర్మాత సతీష్ చెప్పారు.
