‘నయీం డైరీస్’లో అన్నీ నిజాలే తీశా!

‘నయీం డైరీస్’లో అన్నీ నిజాలే తీశా!

గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నయీం చనిపోయి ఐదేళ్లవుతోంది. తన జీవితంపై మీడియాలో ఎన్నో కథనాలొచ్చాయి. అయితే అవన్నీ నిజాలు కాదు.. అసలు నిజాలేంటో తమ ‘నయీం డైరీస్’ సినిమాలో చూపించానంటున్నారు దర్శకుడు దాము బాలాజీ. వశిష్ట సింహా హీరోగా నటించిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందు కొస్తోంది. ఈ సందర్భంగా బాలాజీ ఇలా ముచ్చటించారు.

  • రామ్‌‌‌‌‌‌‌‌గోపాల్ వర్మ దగ్గర ‘కిల్లింగ్ వీరప్పన్‌‌‌‌‌‌‌‌’ చిత్రానికి స్క్రిప్ట్ రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేశాను. ఆయన ఐదేళ్ల క్రితం ‘నయీం’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేశారు. దాని కోసం చాలా రీసెర్చ్ చేసి ఈ స్టోరీ రెడీ చేశాను. కానీ ‘ఆఫీసర్’ మూవీ స్టార్టవడంతో దీన్ని పక్కన పెట్టేశారు వర్మ. కొన్నాళ్ల తర్వాత నిర్మాత వరదరాజు నన్ను అప్రోచ్ అయ్యారు. సినిమా తీద్దాం అంటే కొన్ని లవ్ స్టోరీస్‌‌‌‌‌‌‌‌తో పాటు ఈ కథ కూడా చెప్పాను. ఆయనకి నచ్చడంతో ‘నయీం డైరీస్’ స్టార్టయింది. వర్మకి చెబితే ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు. 
  • అందరికీ తెలిసిన నయీం ఆకారం వేరు. తను చాలా ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉండేవాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని క్యారీ చేసేలా పాత్ర ఉండాలి తప్ప తన ఫేస్‌‌‌‌‌‌‌‌ని, పర్సనాలిటీని కాదని ఫిక్సయ్యాను. కన్నడ యాక్టర్ వశిష్ట సింహాని తీసుకున్నాను. అద్భుతంగా నటించాడు. టీనేజ్​లో ఉన్న నయీంగా ‘బాహుబలి’లో చిన్నప్పటి ప్రభాస్​గా నటించిన నిఖిల్, నయీంకి అక్కగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫేమ్ యజ్ఞాశెట్టి నటించారు. 
  • నయీం గురించి మీడియాలో వచ్చిన వార్తల్లో తొంభై శాతం అబద్ధాలే. అందుకే మేం నూటికి నూరు శాతం నిజాలే చూపించాం. కథ చెప్పే క్రమంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొంత ఫిక్షన్ జోడించామంతే. నయీం టీనేజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు జరిగే ఒక ఫేక్ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమా మొదలవుతుంది. అతని ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగుస్తుంది. మొత్తం నయీం పాయింట్ ఆఫ్​ వ్యూ నుండి ఉంటుంది. ప్రపంచానికి తెలిసిన నయీంగా తయారవక ముందు పద్నాలుగేళ్ల పాటు తనో సిన్సియర్ నక్సలైట్. దళంలో తన పేరు బాలన్న. అసలు నక్సలిజంలోకి ఎందుకెళ్లాడు, ఐ హేట్ పోలీస్ అని జైలుకెళ్లినవాడు, జైలు నుండి వచ్చేటప్పుడు ఐ హేట్ నక్సలైట్స్ అని ఎందుకన్నాడు, అతనిలో ఈ ట్రాన్సఫర్మేషన్ ఎలా జరిగిందనేది కళ్లకు కట్టినట్టు చూపించాం. 
  • నయీం కుటుంబానికి ప్రాణం ఇస్తాడు. అందుకే తనను ఓ రాక్షసుడిలా కాకుండా హ్యూమన్ బీయింగ్‌‌‌‌‌‌‌‌లా ట్రీట్ చేశాను.  తనకీ కొన్ని విషయాల్లో అన్యాయం జరిగింది. ఇతనూ చాలామందికి అన్యాయం చేశాడు. తను హీరోనా, విలనా అనేది చెప్పలేం. మందు, సిగరెట్, అమ్మాయిలు లాంటి వ్యసనాలేవీ లేవు. కానీ ఉన్నట్టుగా మీడియాలో వచ్చింది. పీపుల్స్ వార్ లాంటి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ నక్సలైట్ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌ని పదహారేళ్ల పాటు ఢీకొనడం మామూలు విషయం కాదు. ఎంతో డిసిప్లిన్‌‌‌‌‌‌‌‌ ఉంటేనే సాధ్యం. 
  • ఒక సినిమాగా చూసినప్పుడు ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఎక్సయిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో, ఎమోషనల్ కంటెట్‌‌‌‌‌‌‌‌తో ఎంగేజ్ చేస్తుంది. ఫారెస్ట్ సీన్స్ హాలీవుడ్ రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి. జైలు సీన్స్ కూడా హైలైట్.  యువన్ శంకర్ రాజా శిష్యుడు అరుణ్ ప్రభాకర్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. బలవంతంగా ఏదీ జొప్పించొద్దని పాటలు పెట్టలేదు. రొమాన్స్ కూడా ఉండదు. తన వైఫ్‌‌‌‌‌‌‌‌తో రిలేషన్ మాత్రమే చూపించాం. తన లైఫ్‌‌‌‌‌‌‌‌లో లవ్‌‌‌‌‌‌‌‌స్టోరీస్‌‌‌‌‌‌‌‌ లేవు కూడా. ఒకమ్మాయి మాత్రం తనని ప్రేమించింది. ఆమెని తనే చంపేశాడు. ఆమె ఎవరన్నది సినిమాలోనే చూడాలి. మరణం తర్వాత అతని ఆస్తులు ఏమయ్యాయి, నయీంని చంపించిన పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ వ్యక్తి ఎవరు అనేది కూడా చూడొచ్చు. 
  • నయీం క్లాస్‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి తనతో కలిసి జైలులో ఉన్న నక్సలైట్స్​ని,  సెల్‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌‌‌‌‌ని, పోలీసాఫీసర్స్‌‌‌‌‌‌‌‌ని కలిసి చాలా విషయాలు సేకరించాను. సినిమా ఇంకా బయటికి రాలేదు కనుక బెదిరింపు కాల్స్, పొలిటికల్ ప్రెజర్స్ లాంటివేం లేవు. ఒక పోలీసాఫీసర్ మాత్రం టైటిల్ మార్చమన్నారు. కుదరదని చెప్పాను. సెన్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇబ్బందులొస్తే రివిజనల్ కమిటీకి వెళ్లాం. కట్స్ లేకుండా ఎ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. రిలీజ్ తర్వాత మాత్రం నయీంలైఫ్‌‌‌‌‌‌‌‌తో ముడిపడ్డవారంతా నన్ను విమర్శించొచ్చు. 

థియేటర్స్‌‌‌‌‌‌‌‌లోనే రిలీజ్ చేస్తాం!
నేను బెంగళూరు బేస్డ్‌‌‌‌‌‌‌‌ బిల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని. సినిమా ప్రొడ్యూస్ చేయాలనే కోరిక చాలాకాలంగా ఉంది. మూడేళ్ల క్రితం బాలాజీకి విషయం చెబితే, నాలుగు స్టోరీస్ చెప్పాడు. వాటిలో నయీం స్టోరీ ఎక్కువ ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. మెప్పిస్తుందనే నమ్మకం కలిగింది. దాంతో దాన్నే పట్టాలెక్కించాం. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే పెట్టి తీశాం. సినిమా చాలా బాగా వచ్చింది. పది వరకు యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. అన్నీ థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. కోవిడ్‌‌‌‌‌‌‌‌కి ముందే అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి. సరిగ్గా రిలీజ్ చేద్దామనుకునేసరికి కరోనా ఉధృతి పెరగడంతో వాయిదా వేశాం. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాం. కన్నడలో ‘గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్’ అనే పేరు నిర్ణయించాం. ముందుగా తెలుగులో రిలీజ్ చేసి, ఆ తర్వాత కన్నడలో విడుదలకి ప్లాన్ చేస్తున్నాం. ఫైట్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమా తెలుగులో ఇటీవల రాలేదు. కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అందుకే ఓటీటీకి వెళ్లకుండా థియేటర్స్‌‌‌‌‌‌‌‌లోనే రిలీజ్ చేయబోతున్నాం.  
సి.ఎ.వరదరాజు, నిర్మాత

ఇంటర్వ్యూ: పమ్మి రమేష్‌‌బాబు