చేతుల్లో ఎప్పుడూ ఫోన్లు ఉండడం వల్లే మహిళలపై నేరాలు

చేతుల్లో ఎప్పుడూ ఫోన్లు ఉండడం వల్లే మహిళలపై నేరాలు

తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ఓ సినిమా ఆడియా ఫంక్షన్ అతిథిగా హాజరైన ఆయన మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మహిళలు కొన్ని విషయాల్లో చాలా అజాగ్రత్తగా ఉన్నారని, తమను మగవాళ్లు ఉపయోగించుకునేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

‘కరుత్తుక్కలై పధివు సీ’ చిత్రం ఆడియో లాంచ్ కు వచ్చిన భాగ్యరాజ్ ..”  మగవారిని అన్యాయం చేసే స్త్రీలు చివరకు వారే అన్యాయమవుతారని” అన్నారు. మహిళలు తమ అక్రమ సంబంధాల కోసం తమ భర్తను, పిల్లలను హత్య చేస్తారు, కానీ పురుషులు మాత్రం తాము వివాహం చేసుకున్న భార్యలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తమ సంబంధాలను కొనసాగిస్తారని అన్నారు . “ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా  ఫోన్‌లలోనే ఉంటున్నారు, వారిపై ఘోరాలు జరగడానికి ఇది కూడా ఓ కారణం. మహిళలపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో ఇలాంటి నేరాలేవీ జరగలేదు ”.అని అన్నారు.

అదే స్టేజీపై ఉన్న కస్తూరి రాజా, ఎస్ వె శేఖర్, నటుడు-సినిమాటోగ్రాఫర్ నటరాజ్, సంగీత దర్శకుడు ధీనా లు భాగ్యరాజా మాటలకు సైలెంట్ అయిపోయారు.

Director K Bhagyaraj faces wrath after misogynistic speech during audio launch