GHAATI: శీలావతి క్యారెక్టర్‌‌తో అనుష్క విశ్వరూపం.. ఘాటిపై అంచనాలు పెంచిన డైరెక్టర్ క్రిష్‌‌

GHAATI: శీలావతి క్యారెక్టర్‌‌తో అనుష్క విశ్వరూపం.. ఘాటిపై అంచనాలు పెంచిన డైరెక్టర్ క్రిష్‌‌

అనుష్క శెట్టి లీడ్‌‌ రోల్‌‌లో క్రిష్‌‌ జాగర్లమూడి రూపొందించిన చిత్రం ‘ఘాటి’. విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్యరావు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం (ఆగస్టు 31న) నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ‘తూర్పు కనుమలు.. ఆ పర్వత శ్రేణుల మధ్య ఉండే మనుషులు, వారి మనస్తత్వాలు కలగలిపి తీసిన చిత్రమిది.

రచయిత చింతకింద శ్రీనివాసరావు చెప్పిన ఈ కథ ఎక్సయిటింగ్‌‌గా అనిపించింది. అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి.. ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ చేశారు అనుష్క. ఇందులో ఆమె విశ్వరూపాన్ని చూపించబోతున్నాం. తను చేసిన శీలావతి క్యారెక్టర్‌‌తో ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు.

దేశిరాజుగా విక్రమ్ ప్రభు, కుందుల నాయుడుగా చైతన్య బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. జగపతిబాబు గారి క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక సూత్రధారిలాగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా ఎక్సైటింగ్‌‌గా ఉంటాయి. కనీ, విననీ పాత్రలు ఘాటిలో చూస్తారు.

ఇందులో అందమైన సోల్ ఉంది. ఆడియెన్స్ ఆ సోల్‌‌ని మనసులో నింపుకుని వెళ్తారు’ అని క్రిష్ చెప్పారు. ఈ చిత్రంలో మంచి పాత్రలు పోషించామని రిలీజ్ కోసం ఈగర్‌‌‌‌గా వెయిట్ చేస్తున్నామని జగపతిబాబు, విక్రమ్ ప్రభు, చైతన్య రావు అన్నారు. ఇందులో అనుష్కని రియల్ క్వీన్‌‌గా చూస్తారని నిర్మాత రాజీవ్ రెడ్డి అన్నారు. 

ఘాటి సెన్సార్:

ఇటీవలే ‘ఘాటి’ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు U/A స‌ర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంట‌ల 37 నిమిషాల రన్ టైంతో మూవీ రానుంది. అరకు, గాంజా మాఫియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కథ రూపొందించినట్లు టాక్. ఫ‌స్టాఫ్ మొత్తం ఎమోష‌న‌ల్ జ‌ర్నీతో మొదలై, ఇంటర్వెల్కి బిగ్ ట్విస్ట్ ఉండబోతుందట. అలాగే, సెకండాఫ్ ఊహించని రీతిలో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్‌గా ఉంటుందని సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం.

విక్రమ్‌ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు, రవీంద్రన్ విజయ్ పాత్రలు పవర్ ఫుల్గా ఉండనున్నాయట. ముఖ్యంగా అనుష్క శత్రువులను ఉచకోత కోస్తూ తన వీరత్వాన్ని ప్రదర్శించిందని సెన్సార్ టాక్. ఓవరాల్గా ‘ఘాటి’.. 'ఫ‌స్టాఫ్ మొత్తం ఎమోష‌న‌ల్, సెకండాఫ్ యాక్షన్ మోడ్'.. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని సెన్సార్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.