Maruthi: సైలెంట్‌గా స్క్రిప్ట్ ఫినిష్ చేసిన రాజా సాబ్ డైరెక్టర్.. సంక్రాంతి టార్గెట్‌గా కొత్త సినిమా!

Maruthi: సైలెంట్‌గా స్క్రిప్ట్ ఫినిష్ చేసిన రాజా సాబ్ డైరెక్టర్.. సంక్రాంతి టార్గెట్‌గా కొత్త సినిమా!

‘ది రాజా సాబ్’ ఫలితం తర్వాత డైరెక్టర్ మారుతి (Maruthi) నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో తెరకెక్కించిన ది రాజా సాబ్ భారీ అంచనాల మధ్య విడుదలైనా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మారుతిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే శ్రీరామనవమి సందర్భంగా (మార్చి 27న) మారుతి కీలక అప్డేట్ ఇచ్చారు. తన కొత్త స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్‌ ఇస్తున్న ఫోటోను షేర్ చేస్తూ, “ప్రతి ఓటమి ఒక పాఠమే, నా తదుపరి సినిమా త్వరలోనే ప్రారంభమవుతుంది” అని పేర్కొన్నారు. ప్రేక్షకులు, మీడియా నుంచి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మరింత మెరుగైన కంటెంట్ ఇవ్వడానికి కృషి చేస్తానని చెప్పారు.

“ప్రతి ప్రయాణం ఒక నేర్చుకునే అనుభవమే. ఈ పవిత్రమైన శ్రీరామనవమి పండగ సందర్భంగా, ఆయన ఆశీస్సులతో నా నెక్స్ట్ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుకుంటున్నందుకు ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాను. ఎప్పటికప్పుడు నాకు మద్దతుగా నిలుస్తూ, మీ విలువైన అభిప్రాయాలను పంచుకుంటున్న నా ప్రేక్షకులు, శుభాకాంక్షలు తెలిపే వారు మరియు మీడియా స్నేహితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ అందరినీ నేను ఎంతో గౌరవిస్తాను. మీ అభినందనలు మరియు మద్దతు పొందేందుకు నా వంతు శక్తి మేరకు కృషి చేస్తాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు” అని మారుతి తెలిపారు. అయితే, ప్రాజెక్ట్ వివరాలు గానీ, హీరో ఎవరనేది మాత్రం మారుతి రివీల్ చేయలేదు. 

ALSO READ : ప్రతి దానికి సారీ చెప్పడం మానుకోండి.. 

మెగా కంపౌండ్ హీరోతో మారుతి!

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో మారుతి చర్చలు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాజాసాబ్' వంటి హారర్ జానర్ తర్వాత, ఈసారి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

రిలీజ్ ప్లాన్ & టైటిల్ రూమర్స్!

ఈ సినిమా 2027 సంక్రాంతిని లక్ష్యంగా పెట్టుకుని రూపొందించబడుతున్నట్టు సమాచారం. ‘భలే భలే మగాడివోయ్’ తరహాలో ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నారని, ‘హ్యాపీ పొంగల్’ (Happy Pongal) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు, హీరో కన్ఫర్మేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.