రేట్లు తగ్గించండి..సినిమాను బతకనీయండి

 రేట్లు తగ్గించండి..సినిమాను బతకనీయండి

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన '7 డేస్ 6 నైట్స్  మూవీ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోం ది. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా... మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అన్ని ఏరియాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ లభిస్తుండటంతో...చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను  నిర్వహించారు. 

చిన్న సినిమాల పరిస్థితి ఏంటీ ...?

'7 డేస్ 6 నైట్స్  మూవీపై ప్రేక్షకుల స్పందన చూశాక చాలా సంతోషంగా అనిపించిందని డైరెక్టర్ ఎంఎస్ రాజు అన్నారు.   ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 350 మందితో  సినిమా చూశానని...మార్వలెస్ ఎక్స్‌పీరియ‌న్స్‌ అని చెప్పారు. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కష్టమైన పని అని..అంత కష్టపడి చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడం ఆనందంగా ఉందన్నారు.  ప్రతి షోకి అన్ని చోట్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయన్నారు.  మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ ఫుల్ అన్న ఎంఎస్ రాజు... 'శంకరాభరణం' నుంచి ఇప్పటి వరకు క్లాసిక్ సినిమాలు మౌత్ టాక్ వల్ల పెరిగాయన్నారు. అటు టాలీవుడ్ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందన్నారు డైరెక్టర్ ఎంఎస్ రాజు. పెద్ద నిర్మాతలు పాన్ ఇండియా హీరోలతో సినిమాలు చేస్తున్నారని చెప్పారు.  ప్రస్తుతం దాసరి నారాయణరావు, కె బాలచందర్ లా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే..? 'హ్యాపీ డేస్' లాంటి సినిమాలు వస్తే? ఏంటని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడ్డారు.  ఇండస్ట్రీ తాలూకా పోకడ మారిందన్న ఆయన..ఓటీటీలో ప్రేక్షకుడు సినిమాను చూసేస్తున్నాడని చెప్పారు.  

టికెట్లు తగ్గిస్తేనే సినిమా బతుకుతుంది...

ఒకప్పుడు తాను పెద్ద సినిమాలు చేశానని ఎంఎస్ రాజు అన్నారు. అయితే అప్పుడు లో బడ్జెట్ సినిమాలు తీశానని...ఆ సమయంలో టికెట్ ధర ప్రేక్షకులకు అందుబాటులో ఉండేదని చెప్పారు. కానీ  ఇప్పుడు పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయన్నారు. అయితే పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకున్నా పర్లేదు కానీ... చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు.  ఓ  థియేటర్‌లో  టికెట్ రేటు 200  అని ఉందని.. చిన్న సినిమాకు అంత డబ్బులు పెట్టి ఎలా చూస్తానని చెప్పారు. '7 డేస్ 6 నైట్స్  సినిమాకు టాక్ బావుందన్న ఆయన... జనాలు వస్తున్నారన్నారని తెలిపారు. అయితే  ఏవరేజ్ ఫిల్మ్ అయితే ఓటీటీలో వస్తే చూద్దామని అనుకుంటున్నారని... ప్రయోగాత్మక సినిమాలు చూడటానికి టికెట్ రేటు ఎంత తగ్గిస్తారు? 30 శాతమా? 40 శాతమా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రెట్లు తగ్గించాలని కోరారు. లేదంటే..ఇదొక పెద్ద సినిమాల ఇండస్ట్రీగా ఉంటుంది తప్ప చిన్న సినిమాల ఇండస్ట్రీగా ఉండదన్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.  

ఇది ఫ్యామిలీ మూవీ..

'7 డేస్ 6 నైట్స్ చిత్రం ఫ్యామిలీ మూవీ అన్నారు హీరో రోహన్.  ఇంటర్వెల్ తర్వాత, సినిమా అయ్యాక ప్రేక్షకులు తన దగ్గరకు వచ్చి మెచ్చుకున్నారని చెప్పారు.  ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.  80 ఏండ్ల నానమ్మ కూడా చూశారని... ఆవిడకు కూడా బాగా నచ్చిందన్నారు. '7 డేస్ 6 నైట్స్ సినిమాకు  ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని హీరోయిన్లు మెహర్ చాహల్, కృతికా శెట్టి అన్నారు.  ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో హీరో & నిర్మాత సుమంత్ అశ్విన్, నిర్మాత రజనీకాంత్ ఎస్, సహ నిర్మాత జె. శ్రీనివాసరాజు, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి తదితరులు పాల్గొన్నారు.