
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెవిల్(Devil). ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్(The British Secret Agent) అనే ట్యాగ్ లైన్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే.. డెవిల్ సినిమా మొదలైనప్పుడు ఈ సినిమా దర్శకుడిగా నవీన్ మేడారం పేరు కనిపించింది. కానీ ఇటీవల విడుదలైన పోస్టర్స్ అండ్ ట్రైలర్ లో మాత్రం ఆయన పేరు కనిపించలేదు. దర్శకుడిగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా పేరు కనిపించింది. అయితే.. ఇదే విషయంపై అభిషేక్ నామాని ప్రశ్నించగా.. నవీన్ ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయలేడని, షూటింగ్ మొదలైన రెండోరోజే ప్రాజెక్టు నుండి తొలగించాలని ఆయన చెప్పుకొచ్చారు.
దీంతో తాజాగా దర్శకుడు నేవీన్ మేడారం స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. డెవిల్ సినిమా నా బిడ్డలాంటిది. దాదాపు మూడేళ్ల పాటు కష్టపడ్డాను. 105 రోజుల పాటు షూటింగ్ చేశాను. చిన్నచిన్న ప్యాచ్ వర్క్ తప్పా.. మొత్తం నేనే వర్క్ చేశాను. కేవలం ఈగోల కారణంగా నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తున్నారు. ఈ విషయంపై నా మౌనాన్ని చేతకానితనం అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. ఎవరిపైన కూడా లీగల్ గా చర్యలు తీసుకోవాలనుకోవడం లేదు. డెవిల్ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు అన్ని రకాలుగా సహకరించిన మా హీరో కల్యాణ్ రామ్ గారికి తాను కృతజ్ఞతలు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అంటూ ఎమోషనల్ నైట్ రాసుకొచ్చారు నేవీన్ మేడారం. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.