తెలుగలో ప్రముఖ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ చిత్రం మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
హీరో తేజ సజ్జ యాక్టింగ్, ప్రశాంత వర్మ మేకింగ్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండటంతో హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మించారు. కాగా రూ. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ.350 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్ర సీక్వెల్ కూడా ఉంటుందని.. జై హనుమాన్ గా టైటిల్ ని ఖరారు చేశారు.
అయితే జై హనుమాన్ చిత్రం గురించి పలు గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా హనుమాన్ పెద్ద హిట్ అవ్యవడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రెమ్యూనరేషన్ పెంచేశాడాని ఈ క్రమంలో మేకర్స్ నుంచి రూ.50 కోట్లు అడుగుతున్నట్లు కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అలాగే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ సుముఖంగా లేకపోవడంతో జై హనుమాన్ ప్రాజెక్ట్ టాలీవుడ్ లోని ఓ బడా నిర్మాత చేతికి వెళ్ళిందని మరికొందరు అంటున్నారు. కానీ ఈ వార్తలలో నిజమెంతనేది ఇంకా తెలియాల్సి ఉంది.