
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. డార్లింగ్ ఫాన్స్ కూడా ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలపై మాత్రం మేకర్స్ నీళ్లు చల్లుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది సలార్.
దానికి కారణం సలార్ సినిమా కథ మారడం అనే వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ రెండు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి పార్ట్ కు ఒక లెవల్లో ఉండే క్లైమాక్స్ ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న హైప్ కు ఆ క్లైమాక్స్ అంత హై గా ఉండకపోవచ్చని భావించి.. మరో హైవోల్టేజ్ క్లైమాక్స్ ను సెట్ చేశాడట మేకర్స్. ప్రస్తుతం కొత్త క్లైమాక్స్ కు సంబందించిన షూట్ హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం. ఈ కారణంగానే సలార్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం.. లేట్ అయితే అయ్యింది కానీ మాకు కాలర్ ఎగరేసుకునే సినిమా కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే సలార్ రిలీజ్ పై క్లారిటీ రాలేదు.
ఇక సలార్ సినిమా విషయానికి వస్తే.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హోంబేలె ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు