మళ్ళీ పూజాకే జై కొట్టిన త్రివిక్రమ్.. మరి అల్లు అర్జున్ సంగతేంటీ?

మళ్ళీ పూజాకే జై కొట్టిన త్రివిక్రమ్.. మరి అల్లు అర్జున్ సంగతేంటీ?

త్రివిక్రమ్(Trivikram)కు పూజా హెగ్డే(Pooja hegde) సెంటిమెంట్ గా మారిపోయిందా? మరో సినిమాలో కూడా ఆమెనే తీసుకుంటున్నాడా? ముచ్చటగా మూడోసారి ఈ లేడీతో హైట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడా? అవును ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా పూజా హెగ్డేనే తీసుకుంటున్నాడట త్రివిక్రమ్. వీరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అరవింద సమేత, ఆలా వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

అంతేకాదు మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారంలో కూడా ముందుగా పూజానే తీసుకున్నారు కానీ.. అనుకోను కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుండి పూజ బయటకు వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి తన తరువాతి సినిమా కోసం కూడా ఫస్ట్ ప్రియారిటీ పూజాకే ఇచ్చారట త్రివిక్రమ్. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.