రామ్ చరణ్తో డంకి దర్శకుడి సినిమా.. క్లారిటీ ఇచ్చేశాడు

రామ్ చరణ్తో డంకి దర్శకుడి సినిమా.. క్లారిటీ ఇచ్చేశాడు

రాజ్ కుమార్ హిరానీ(Rajkumar Hirani).. ఈ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన దర్శకత్వం వచ్చిన లేటెస్ట్ మూవీ డంకి. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. రాజ్ కుమార్ హిరానీ గత చిత్రాల మాదిరిగానే ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు కానీ.. రాజ్ కుమార్ హిరానీ నుండి వచ్చిన పీకే, 3 ఇడియట్స్ రేంజ్ లో భారీ విజయాన్ని అందుకోలేకపోయింది ఈ మూవీ. నిజానికి ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం రాజ్ కుమార్ హిరానీపై ఉన్న నమ్మకమే. కానీ ఈ సారి మాత్రం ఆ నమ్మకం ఫలించలేదు. ఆ కారణంగా డంకి డీసెంట్ హిట్ గా నిలవాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే.. రాజ్ కుమార్ హిరానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు అనే న్యూస్ కొంత కాలంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారణం ఆ మధ్య రామ్ చరణ్ ముంబై కి వెళ్లినప్పుడు.. రామ్ చరణ్ అండ్ రాజ్ కుమార్ హిరానీ కలవడమే. వారి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు అనే న్యూస్ వైరల్ ఆయాయి. 

ఇదే విషయంపై దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ చరణ్ తో సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా ప్లాన్ చేయడం లేదు. కానీ నాకు రామ్ చరణ్ తెలుసు. ఒకవేళ ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతం.. అంటూ చెప్పుకొచ్చారు రాజ్ కుమార్ హిరానీ. దీంతో రామ్ చరణ్, రాజ్ కుమార్ హిరానీ కాంబోపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.