ఆసక్తిని రేకెత్తిస్తోన్న రాక్షసుడు2 పోస్టర్.. హీరో ఎవరంటే?

ఆసక్తిని రేకెత్తిస్తోన్న రాక్షసుడు2 పోస్టర్.. హీరో ఎవరంటే?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Saisrinivas)కెరీర్కి బాగా గుర్తింపు ఇచ్చిన చిత్రం రాక్షసుడు. ఈ మూవీకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. రాక్షసుడు మూవీ కమర్షియల్‌ థ్రిల్లర్ గా సూపర్ హిట్ టాక్ అనిపించుకుంది. డైరెక్టర్ రమేష్ వర్మ(,Rameshvarma) తెరకెక్కించిన ఈ మూవీ..తమిళ్ హిట్‌ రాచ్చసన్‌ కి రీమేక్ గా వచ్చింది. ఈ సినిమాలో హీరో సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ యాక్టింగ్ తో..కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

లేటెస్ట్ గా రాక్షసుడు మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చాలా రోజుల నుంచి సీక్వెల్ స్టార్ట్ కాబోతున్నట్లు న్యూస్ వినిపించిన..త్వరగా పట్టాలెక్కలేదు.దీంతో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి అవ్వడంతో..ఇవాళ (అక్టోబర్ 14న) షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ హిట్ సీక్వెల్లో హీరోగా సాయి శ్రీనివాస్ కన్ఫర్మ్ అనేది ప్రకటించకపోవడంతో.. సస్పెన్స్ నెలకొంది. దీంతో రాక్షసుడు2(Rakshasudu2)లో హీరో ఎవరనేది..ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.  

రాక్షసుడు2 పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్ టైటిల్లో..గొలుసులతో కూడిన గొడ్డలి..బిల్డింగుల మధ్య డెడ్ బాడీ మోసుకుంటూ ఒక సైకో తో పోస్టర్ థ్రిల్లింగ్ గా ఉంది. ఇక త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

డైరెక్టర్ రమేష్ వర్మ గత చిత్రం ఖిలాడీ. ఈ మూవీ హీరో రవితేజ తో తీసినప్పటికీ ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడంతో డిజాస్టర్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నరాక్షసుడు2 మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ స్వరాలూ సమకూరుస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్స్ అందిస్తుండగా..సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

ALSO READ : చనిపోయిన ప్రవల్లికకు ఎఫైర్ అంటగడతారా : లక్ష్మణ్