క‌రోనాపై వ‌ర్మ స్టైల్లో ట్వీట్

క‌రోనాపై వ‌ర్మ స్టైల్లో ట్వీట్

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిపై త‌న‌దైన స్టైల్లో ట్వీట్ చేశాడు డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇప్పుడు ఏమి చేయాలి కరోనా అంటూ ట్వీట్ చేశాడు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో ఏమీ తోచడం లేదని, సమయం అస్సలు గడవడం లేదని ట్విటర్‌లో రాసుకొచ్చారు. నెలకు 30 రోజులు ఉంటాయని ఎప్పుడూ అనుకునేవాడిని. కానీ వెయ్యి రోజులు ఉంటాయని మొదటిసారి అనిపిస్తోంది. సమయం ముందుకు సాగడం లేదు. కరోనా భయంతో సమయంతో సహా అన్నింటిని ఆపేశారు. ఇప్పుడు ఏమి చేయాలి కరోనా అంటూ వర్మ తనదైన స్టైల్లో ట్వీట్‌ చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో జనం ప్రాణాలను కోవిడ్‌-19 హరిస్తున్న క్ర‌మంలో బాధిత దేశాలు లాక్ డౌన్‌ ప్రకటించాయి. ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించాయి. మన దేశంలోనూ లాక్ డౌన్‌ కొనసాగుతోంది. అత్యవసర సేవల సిబ్బంది తప్పా జనమంతా ఇళ్లకే పరిమితమైన విష‌యం తెలిసిందే.