విలక్షణ దర్శకుడు “ఆర్జీవీ”(Ram Gopal Varma) అంటేనే ఫైర్. సినిమాల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ, తన ఆలోచనా విధానంలోనూ ఎప్పుడూ విలక్షణతను చాటుకుంటూ ఉంటాడు ఈ వర్సాటాలిటీ వర్మ. ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద గ్యాంగ్‌స్టర్ డ్రామాలు, పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ల రూపురేఖలను మార్చి వెండితెరపై తనదైన సంతకం చేసి శాసిస్తున్నాడు. ఓ సత్య (Satya), కంపెనీ (Company), రంగీలా (Rangeela), సర్కార్ 1,2,3 (Sarkar), భూత్ (Bhoot), షూల్ (Shool), కౌన్ (Kaun?), దౌడ్ (Daud), శివ (Shiva) వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను నిర్మించుకున్నాడు. ముఖ్యంగా ఆర్జీవీ.. తన నిజ జీవితంలో సాధారణంగా ఏదీ నమ్మడు. దేవుడ్ని, మనుషులు చూపే ప్రేమల్ని.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా వాటిని నమ్మడు. అలాంటి “ఆర్జీవీ” పుట్టినరోజు ఇవాళ (ఏప్రిల్ 7).
ఈ సందర్భంగా 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న వర్మకి సినీ ప్రముఖులతో పాటుగా ఆయన కల్ట్ ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సందర్భంలో కూడా వర్మ తన స్టైల్‌లోనే స్పందిస్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్‌తో అందరినీ ఆలోచింపజేశారు.
Also Read : అత్తగారింట్లో అడుగుపెట్టిన రౌడీ హీరో
“ఈ రోజు నేను మరణానికి మరో సంవత్సరం దగ్గరయ్యాను. కాబట్టి మీకు నిజంగా సంతోషం కలిగించే ప్రత్యేక కారణం ఉంటే తప్ప నా పుట్టినరోజును వేడుకలా జరుపుకోవద్దు. ధన్యవాదాలు,” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
Today i reached 1 more year closer to my death and so let’s not celebrate unless for whatever reasons that makes you happy ! Thanks 💐💐💐 pic.twitter.com/mkKLW9G32t
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2026
ఇది కదా వర్మ అంటే..! సాధారణంగా, అభిమానించే వాళ్లు విషెష్ చెబితే.. మనకి థ్యాంక్స్ అని స్పందిస్తాం. ఇలా రిప్లయ్ ఇవ్వడం అందరి వంతు. కానీ, ఇలా తాత్వికంగా స్పందించడం వర్మకు మాత్రమే సాధ్యమైంది. జీవితంలోని ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ మనం మరణానికి దగ్గరవుతున్నామనే వాస్తవాన్ని ఆయన తన స్టైల్‌లో గుర్తు చేశారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, వర్మ ఆలోచనల్లోని నిజాయితీ, భిన్న దృక్పథాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ స్పృష్టిలో నిజానికి చాలా దగ్గరగా ఉండే అసలైన వ్యక్తిత్త్వం ఉన్న మనిషి అంటే ఆర్జీవీ అని ట్వీట్స్ పెడుతున్నారు. ఆయనకు మాత్రమే సాధ్యమైన ఈ తరహా స్పందన మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
‘పోలీస్ స్టేషన్ మే భూత్’:
దర్శకుడు ఆర్జీవీ తన కొత్త సినిమా పనిలో బిజీలో ఉన్నారు. ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ పేరుతో ఆర్జీవీ తనకు అచ్చొచ్చిన హారర్ థ్రిల్లర్ జోనర్లో మూవీ తెరకెక్కిస్తున్నారు. అంటే 'పోలీస్ స్టేషన్‌లో దెయ్యం' అని అర్ధం. ఇలా టైటిల్కి తగ్గట్టుగానే ‘యూ కాంట్ అరెస్ట్ ది డెడ్’ అనే క్యాప్షన్ తో ఆర్జీవీ తన మార్క్ చూపించే ప్రయత్నం చేయబోతున్నారు.
ఇందులో బాలీవుడ్‌లో పవర్‌హౌస్ ఫెర్ఫార్మర్‌గా పేరుగాంచిన మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్ చేస్తున్నారు. జెనీలియా, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే, వీరి లుక్స్ రివీల్ చేసి, సినిమాపై హార్రర్ ఫియర్ తీసుకొచ్చారు.
No , @meramyakrishnan is not playing a BHOOT in POLICE STATION MEIN BHOOT pic.twitter.com/1qOPuZ9bFh
— Ram Gopal Varma (@RGVzoomin) November 3, 2025
‘పోలీస్ స్టేషన్ మే భూత్’ కాన్సెప్ట్:
ఓ భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను.. పోలీస్ ఆఫీసర్ ఎన్‌కౌంటర్ చేయగా, రివేంజ్ తీర్చుకోవడానికి అతను దెయ్యంలా తిరిగొస్తే ఏం జరిగింది అనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని వర్మ ప్రకటించారు. అంటే, సాధారణంగా.. మనం భయపడినప్పుడు పోలీసుల వద్దకి వెళ్తాం. మరి పోలీసులే భయపడితే ఎక్కడికి వెళ్తారు? అనే ఆసక్తికరమైన ప్రశ్న చుట్టూ ఈ కథ ఉంటుందని ఆర్జీవీ తెలిపారు. ఇలా కథాంశమే ఇంట్రెస్టింగ్గా ఉండటంతో.. ఈ హారర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
A DREADED GANGSTER is KILLED by an ENCOUNTER COP and he COMES BACK as a GHOST to HAUNT the POLICE STATION ..Hence the title “POLICE STATION MEIN BHOOT” You Can’t Arrest The Dead @BajpayeeManoj @geneliad @VauveEmirates @KarmaMediaEnt #uentertainmenthub #PoliceStationMeinBhoot pic.twitter.com/eMOyusT8iy
— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2025
