తెలుగులో ప్రముఖ దర్శకుడు రితీష్ రానా మరియు శ్రీ సింహ కాంబినేషన్ లో తెరకెక్కిన మత్తు వదలరా 2 చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలకి ప్రేక్షుకులు ఫిదా అయ్యారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు తదితరులతోపాటూ మరింత సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రం గురించి పాజిటివ్ స్పందించడంతో కలెక్షన్లు మరింత పుంజుకున్నాయని చెప్పవచ్చు.
అయితే దర్శకుడు రితీష్ రానా మత్తు వదలరా 3 పై స్పందించాడు. ఇందులో భాగంగా కచ్చితంగా భవిష్యత్ లో మత్తు వదలరా 3 ఉంటుందని స్పష్టం చేశాడు. కానీ ఈ సీక్వెల్ కంటే ముందుగా తాను మరో చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. అయితే తన నెక్స్ట్ సినిమా కథ మరియు హీరో తదితర వివరాలు గురించి మాత్రం తెలియజేయలేదు.
ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకూ మత్తు వదలరా 2 చిత్రం దాదాపుగా రూ.19 కోట్లుకి పైగా వసూళ్లు సాధించింది. అంతేగాకుండా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూతీ చేసుకుని లాభాల్లోకి అడుగుపెట్టింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీ.