వెంకటేష్ సైంధవ్ నుంచి ఫ్యామిలీ పోస్టర్ రిలీజ్

వెంకటేష్ సైంధవ్ నుంచి ఫ్యామిలీ పోస్టర్ రిలీజ్

హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh) ప్రస్తుతం తన కెరీర్ మైల్ స్టోన్ మూవీ 75వ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. ఈ మూవీకు సైంధవ్ (Saindhav) అనే విభిన్న టైటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం శైలేష్ కొలను(Sailesh Kolanu) అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్లో కథను రెడీ చేసినట్లు సమాచారం..కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన సైంధవ్ గ్లింప్స్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ అమాంతం పెంచేసింది.  

ఇవాళ (సెప్టెంబర్ 18) వినాయక చవితి స్పెషల్ గా ఈ మూవీ నుంచి ఫ్యామిలీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజైన వెంకటేష్ పోస్టర్స్ లో ఫెరోషియస్ లుక్‌‌‌‌లో కనిపించగా..లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూల్ గా నవ్వుతూ..ఫ్యామిలీ స్టార్ గా మారిపోయాడు. వెంకటేష్ జోడీగా జెర్సీ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుండగా..వీరికి పాప ఉండనుందని తెలుస్తుంది.  

ALSO READ: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వినాయక చవితి వేడుకలు
 

అంతేకాకుండా ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కీ రోల్స్ చేస్తుండగా..హీరో ఆర్య మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. దసరా, గురు మూవీస్ తో తెలుగులో సత్తా చాటిన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ స్వరాలూ సమకూరుస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 22న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.