‘దసరా’ మూవీ గురించి దర్శకుడి మాటల్లో..

‘దసరా’ మూవీ గురించి దర్శకుడి మాటల్లో..

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘దసరా’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేడు సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘నేను పుట్టి పెరిగింది పెద్దపల్లి. మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్. ఆ ప్రభావంతోనే సింగరేణి సాక్షిగా ఈ కథను రాశాను. సుకుమార్ సర్ దగ్గర డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వర్క్ చేశాను. తర్వాత నేను రాసిన కథను నిర్మాత సుధాకర్ గారికి వినిపించాను. ఆయన నాని దగ్గరికి పంపడంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ‘దసరా’లో కనిపించే వీర్లపల్లి మా నాన్నమ్మ గారి ఊరు. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. ఆ ఊరి ప్రభావం నాపై చాలా వుంది. అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా అల్లుకున్న కథే ‘దసరా’. ధరణి పాత్రలో నాని, వెన్నెలగా కీర్తి సురేష్​ క్యారెక్టర్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి.

నాని నెక్స్ట్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్టింగ్ చేశారు. కీర్తి సురేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది సూపర్ బ్రెయిన్ పవర్. ఏదైనా చెబితే ఐదు నిమిషాల్లో పట్టేస్తుంది. డబ్బింగ్ కూడా అద్భుతంగా చెప్పింది. ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ చూసి సూరి పాత్రకు దీక్షిత్ శెట్టిని సెలెక్ట్ చేశా. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ప్లస్ అవుతుంది. పాన్ ఇండియా స్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేద్దామని ముందు అనుకోలేదు. మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత బడ్జెట్ అనుకున్నదాని కంటే ఎక్కువ  అవుతుందని మేమంతా భావించాం. అయినా నిర్మాత సుధాకర్ గారు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు’ అని చెప్పాడు.