దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం

దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లాలోని స్వస్థలం కందులపాvలెంలో నివసిస్తున్న కృష్ణారావు.. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు.