Ahimsa Trailer : ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే

Ahimsa Trailer : ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే

దగ్గుబాటి అభిరామ్ హీరోగా, తేజ డైరక్షన్లో తెరకెక్కిన మూవీ అహింస. సురేష్ ప్రోడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. హీరో రామ్ చరణ్ తేజ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 2 నిమిషాల 36 సెకన్లున్న మూవీ ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. వ్యవసాయం చేసుకుని జీవించే ఓ రైతు బిడ్డ, ఓ భూస్వామి మధ్య జరిగే పోరాటమే ఈ మూవీ కాన్సెప్ట్ అని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఇందులో హీరోయిన్ సదా లాయర్ పాత్రలో నటిస్తుండగా, అభిరామ్ కు జోడీగా గీతిక నటించింది. ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇప్పటికే సాంగ్స్, పోస్టర్లతో  అంచనాలను పెంచిన అహింస ఇప్పుడు ఆ అంచనాలను ట్రైలర్‌ తో మరింత రెట్టి్ంపు చేసింది. మేకర్స్ ఇంకా రిలీజ్  డేట్ ప్రకటించాల్సి ఉంది.