
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తన డైలాగ్స్తో సినిమాలను హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తాడు. హీరోలకే కాకుండా డైరెక్టర్స్కి కూడా ఫ్యాన్స్ ఉండటంలో త్రివిక్రమ్ ఒకరు. ఎప్పుడు తన మూవీస్లో స్టోరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వని త్రివిక్రమ్..ఈ సారి అదిరిపోయే స్టోరీని రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. ఇక ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో త్రివిక్రమ్ ఓ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీని త్రివిక్రమ్ ఒక ప్రయోగాత్మకమైనా హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్లో తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తూ వచ్చింది.
ఇక మరో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. స్వాతంత్రం రాకముందే జరిగే కొన్ని అంశాలను హ్యూమన్ టచ్తో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే త్రివిక్రమ్ చేతిలో బరువైన కథ ఉన్నట్లే. అంతేకాకుండా ఈ మూవీలో త్రివిక్రమ్ స్థాయిని మించి డైలాగ్స్ ఉంటాయని టాక్. ఇప్పటివరకు త్రివిక్రమ్ పెన్ను పవర్ టాలీవుడ్కి మాత్రమే తెలుసు..ఇక నుంచి తన స్టామినా పాన్ ఇండియా స్థాయిలో చూపించడానికి..రెడీ అయ్యాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవొచ్చు.
దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అంతటి వరుస హిట్స్ గానీ, అంత ఆలోచన విధానం గానీ త్రివిక్రమ్ కు ఉంది. ఒక రాజ్ కుమార్ హిరానీ లాంటి బ్రాండ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్న త్రివిక్రమ్..పాన్ ఇండియా స్థాయిలో నెగ్గడం పెద్ద కష్టమేమి కాదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..త్రివిక్రమ్ కాంబోలో రానున్నఈ సినిమాని గీత ఆర్ట్స్ (Geetha arts), హారికా హాసిని క్రియేషన్స్(Haarika hassine creations) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టును త్రివిక్రమ్2024 చివరలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది.