తెలుగు బేబీ ని మెచ్చుకున్న.. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్

తెలుగు బేబీ ని మెచ్చుకున్న.. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్

ఆనంద్ దేవరకొండ..వైష్ణవి చైతన్య.. విరాజ్ అశ్విన్ జంటగా నటించి.. యూత్ ను ఫిదా చేస్తోన్న మూవీ బేబీ(Baby).  టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శక దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న మూవీపై ఇంట్రెస్ట్ అమాంతం పెరుగుతుంది. లేటెస్ట్ గా నయనతార భర్త ,తమిళ డైరెక్టరు విఘ్నేష్ శివన్(Vignesh Shivan) బేబీ మూవీ టీం పై ప్రశంశల వర్షం కురిపించారు.  

“ఒక కొత్త బోల్డ్ టీమ్ నుంచి వచ్చిన ఈ కొత్తతరం మూవీ బేబీ. క్రేజీ రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ఈ గ్రాండ్ సక్సెస్‏కు కుదోస్. చాలా బోల్డ్‎గా రాశారు. బ్రూటల్ గా చిత్రీకరించారు.” అంటూ డైరెక్టర్ సాయి రాజేష్, హీరో ఆనంద్ దేవరకొండను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ ఇన్ స్టా స్టోరీలో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. డైరెక్టర్ సాయి రాజేష్ విఘ్నేష్ పోస్ట్ పై స్పందిస్తూ.. 'విఘ్నేష్ సర్.. మీకు కృతజ్ఞతలు. మా సినిమా మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది. నానుమ్ రౌడీ ధాన్ సినిమాకు నేను వీరాభిమానిని. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా’ అని రిప్లై ఇచ్చారు.

అలాగే ఈ  స్టోరీని కూడా విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. హీరో  ఆనంద్ దేవరకొండ కూడా స్పందిస్తూ.. ‘థాంక్యూ సో మచ్ సర్. మీకు బేబీ సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా తమిళంలో డైరెక్టర్ విగ్నేష్ ఈ మూవీను రీమేక్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.  

‘బేబి’ మూవీ రిలీజైన 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.71.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయినా ఈ మూవీ..బాక్సాఫీసు కలెక్షన్స్  సాధించటం సంచలన విజయమని ఇండస్ట్రీ భావిస్తోంది.