NTR, Yvs Chowdary: ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి హీరోగా మరో ఎన్టీఆర్.. సినిమా అనౌన్స్ చేసిన వైవిఎస్ చౌదరి

NTR, Yvs Chowdary: ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి హీరోగా మరో ఎన్టీఆర్.. సినిమా అనౌన్స్ చేసిన వైవిఎస్ చౌదరి

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వైవిఎస్ చౌదరి(Yvs Chowdary)కి నందమూరి(Nandamuri) ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన అభిమానం అన్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ కి ఆయన గొప్ప అభిమాని. అందుకే వైవిఎస్ చౌదరి సినిమాలన్నీ ఎన్టీఆర్ కి నమస్కారం చేయడంతోనే మొదలవుతాయి. ఇక దర్శకుడిగా కూడా అయన నందమూరి హీరోలతో సినిమాలు చేశారు. అలా వచ్చినవే.. లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు, సీతయ్య. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. 

అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఆయన నుండి చివరగా వచ్చిన చిత్రం. రేయ్. మెగా హీరో సాయి ధరమ్ హీరోగా పరిచయం అయినా ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక అప్పటినుండి మరో సినిమాను అనౌన్స్ చేయలేడు వైవిఎస్ చౌదరి. కానీ, సడన్ గా ఆయన కొత్త సినిమాను ప్రకటించారు. జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సంధర్బంగా కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు. 

ఈ సినిమా కోసం నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారకరామా రావు ను హీరోగా ఎంచుకున్నాడు. ఆలా.. నందమూరి కుటుంబం నుండి మరో ఎన్టీఆర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. నేడు(జూన్ 10) ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ సినిమాతో మరో కొత్త తెలుగమ్మాయి హీరోయిన్ గా పరిచయం కోబోతోంది. అయితే.. ఈ సినిమాలో హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అనే విషయాన్నీ మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. మరి నందమూరి ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ కొత్త ఎన్టీఆర్ ఎలా ఉంటాడు? ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటాడు? అనేది చూడాలి.