జగ్గారెడ్డి వ్యూహంతో గులాబీ పార్టీలో చిచ్చు.?

జగ్గారెడ్డి వ్యూహంతో గులాబీ పార్టీలో చిచ్చు.?

సంగారెడ్డి గులాబీ పార్టీలో  చిచ్చు రగులుతుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వర్గాన్ని చీల్చి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్న టీఆర్ఎస్ కు ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం నీళ్లు చల్లేప్రయత్నాలు చేస్తోంది. కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు అధికార పార్ సీటీ నియర్‌‌నేతలు అడుగడుగునా మోకాలడ్డు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీలోని అసమ్మతి నేతలతో పాటు కొత్తగా వచ్చే లీడర్లతో గులాబీ పార్టీలో నిత్యం అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఆ మధ్య సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, మరికొందరు మాజీ కౌన్సి లర్లు టీఆర్ఎస్‌లో చేరిన నాటి నుంచి అధికార పార్టీ నేతల్లో ముసలం షురూవైంది. తాజాగా కొండాపూర్ జడ్పీటీసీ, ఆరుగురు సర్పంచ్‌లు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడితో పాటు మరికొందరు నాయకులు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నవిషయం తెలిసిందే.వీరిని పార్టీలో చేర్చుకోవద్ద కొని కొద్ది రోజులుగా ఆ మండలానికి చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేతో  విన్నవించుకున్నట్టు తెలిసింది. మీ ఓటమికి కారకులైన నాయకులను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన సన్నిహితులు మొరపెట్టుకున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే 2024 విజన్‌తో ముందుకు వెళ్తున్న చింత తన అనుచరులకు నచ్చ జెప్పి కొండాపూర్ నేతలను పార్లో టీ చేర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం నచ్చని కొందరు గులాబీ నేతల్లో వారి రాజకీయ భవిష్యత్తుపై కలవరపడుతున్నరు.

కాంగ్రెస్ సైలెంట్‌పై సందేహాలు

నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు,నాయకులు పార్నిటీ వీడుతున్నప్పటికీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహంపై గులాబీ పార్టీలో అనేక సందేహాలు ముందుకొస్తున్నాయి. కాంగ్రెస్ ను ఖాళీ చేసే పనిలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. దీనిపై కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్ అసమ్మతి నేతల ప్రచారమే ఈ మధ్య ఎక్కువైంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందస్తు వ్యూహంతోనే తన అనుచరులను టీఆర్ఎస్‌లో చేర్చి అసలు టైంలో ఆయన కూడా పార్ ఫిటీ రాయించి అందరికీ షాక్ ఇస్తారని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే సంగారెడ్డి అసెంబ్లీ పరిధిలో రాజకీ యంగా పెను మార్పులు జరుగుతాయని రాజకీయ విశ్షలేకులు భావిస్తుండగా,టీఆర్ఎస్ అసమ్మతి వర్గం కూడా ఇదే జరగాలని ఆశిస్తోంది.

అసమ్మతులకు బూస్ట్..

గారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అసమ్మతి వర్గం సైలెంట్‌‌గా అబ్జర్వ్ చేస్తోంది. ఇక్కడ జరిగే రాజకీయ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తూ అందివచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్‌‌లో చేరికలు ఎక్కువవడంతో ఆ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నట్టు ఇటీవల నెలకొన్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై అసంతృప్తి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల కారు ఎక్కేందుకు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆసక్తి చూపించడం టీఆర్ఎస్‌‌లో గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. అందుకే పార్టీలో సమ్మతి నేతలు పెరిగిపోతున్నారని రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.