
- ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం ఎంతో అవసరమని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ) డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి అన్నారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (అటానమస్) కాలేజీలో ఫస్టియర్ డిగ్రీ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసమూర్తి, కాలేజీల జాయింట్ సెక్రటరీ పీవీ రమణ కుమార్, సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన వారు గొప్పగా ఎదిగారన్నారు. ఫ్యాకల్టీ అందిస్తున్న సదుపాయాలను సక్రమంగా ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి, డైరెక్టర్ ప్రొఫెసర్ విష్ణుప్రియ, ప్రిన్సిపాల్ మట్ట శేఖర్ తో పాటు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.