GST 2.0 ఎఫెక్ట్.. 5 లక్షల కంటే తక్కువ ధరకే వస్తున్న టాప్ 5 కార్లు ఇవే..

GST 2.0 ఎఫెక్ట్.. 5 లక్షల కంటే తక్కువ ధరకే వస్తున్న టాప్ 5 కార్లు ఇవే..

 GST 2.0 మార్పులతో ఇండియాలో కారు కొనాలనుకునే వారికీ  గుడ్ న్యూస్. ఇప్పుడు చిన్న, తక్కువ ధర కార్లపై ప్రభుత్వం GSTని 28% నుండి 18%కి తగ్గించింది. దింతో కార్ల తయారీ కంపెనీలు కూడా చిన్నా కార్ల ధరలను తగ్గిస్తూ ప్రకటించింది. అయితే బాగా ఫెమస్ అయినా హ్యాచ్‌బ్యాక్‌కార్ల నుండి ఎంట్రీ-లెవల్ కార్ల ధరలు భారీగా తగ్గాయి.

బడ్జెట్-ఫ్రెండ్లీ కారు కొనాలనుకునే వారికి అంటే  5 లక్షల  కంటే తక్కువకే  కార్ కొనాలని చేస్తున్నవారికి ఇప్పుడు మంచి అప్షన్స్ ఉన్నాయి. ఇవి మొదటిసారి కారు కొనేవారికి, విద్యార్థులకు,  ఇంట్లో రెండో కార్ కోసం చూసే కుటుంబాలకు చాలా ఉపయోగపడుతుంది. GST తగ్గింపు తర్వాత   5 లక్షలలోపు వస్తున్న టాప్ 5 కార్స్ ఇవే... 

మారుతి సుజుకి ఆల్టో K10 దీని ధర రూ.3.70 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ధర 3.50 లక్షల నుండి, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ధర 5 లక్షల నుండి, టాటా టియాగో రూ.4.57 లక్షల నుండి, రెనాల్ట్ క్విడ్ ధర రూ.4.30 లక్షల నుండి  మొదలవుతాయి.

1. మారుతి సుజుకి ఆల్టో K10
ఆల్టో K10 ఆల్ టైం కస్టమర్ ఫెవరెట్  కార్. భారతదేశంలో అత్యంత తక్కువ ధర ఉన్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. పన్ను తగ్గింపుకు ముందు రూ3.70 లక్షలు ఉన్న దీని  ధర GST కోత  తర్వాత మరింత తగ్గింది. ఈ చిన్న కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, ఇంకా మెయింటెనెన్స్ కూడా తక్కువే. సిటీలో వాడకానికి, మొదటిసారి కారు కొనేవారికి ఆల్టో K10 చాలా బెస్ట్. ఈ  కార్  పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది.

2. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
దీని డిజైన్ కొంచెం పెద్దగా, బోల్డ్‌గా ఉండటం వల్ల దీనిని మైక్రో-SUV అని పిలుస్తారు.  GST తగ్గింపు కారణంగా S-ప్రెస్సో ధర కూడా  భారీగా  తగ్గింది. దీని ప్రారంభ ధర సుమారు రూ.3.50 లక్షలు.  ఈ కారు కూడా పెట్రోల్, CNG ఇంజిన్లలో  లభిస్తుంది.

3. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
చిన్న కుటుంబాలకు బాగా నచ్చిన ఈ  హ్యాచ్‌బ్యాక్  కార్ ఇప్పుడు కేవలం 5 లక్షల ఎక్స్-షోరూమ్ కే వస్తుంది. దీని  డిజైన్, విశాలమైన క్యాబిన్, మారుతి సర్వీస్ నెట్‌వర్క్  చిన్న కుటుంబాలకు బెస్ట్ అప్షన్ గా చేస్తాయి. అంతేకాకుండా ఇందులో CNG, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో సహా చాల  రకాల ఇంజిన్ అప్షన్స్ ఉన్నాయి.

4. టాటా టియాగో
టాటా టియాగో కార్  నిర్మాణం బిల్డ్ క్వాలిటీ, మంచి సేఫ్టీ ఫీచర్లు, ఆధునిక డిజైన్ తో మంచి పేరు పొందింది. టియాగో ధరలు కూడా ఇప్పుడు రూ.4.57 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి మొదలవుతాయి. బడ్జెట్ మించకుండా ఎక్కువ ఫీచర్లు, స్టైల్, సేఫ్టీ కోరుకునే వారికి  టియాగో ఒక స్ట్రాంగ్ అప్షన్. దీని ప్రత్యేకత ఏమిటంటే CNG ఆప్షన్‌, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఏకైక కారు ఇదే. 

5. రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.30 లక్షల నుండి ప్రారంభమవుతుంది.  SUV లుక్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,  సులభమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. GST తగ్గింపుతో  సిటీలో కారు కొని వాడే వారికి ఇది మంచి అప్షన్ .