ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీటుపై కన్నేసిన ఎమ్మెల్సీ ఎవరు?

ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి సీటుపై కన్నేసిన ఎమ్మెల్సీ ఎవరు?

 జనగామ నియోజకవర్గంలో BRS రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. సిట్టింగ్ MLA ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హ్యాట్రిక్ కోసం ముందుకెళ్తున్నారు. హ్యాట్రిక్ విక్టరీ దేవుడెరుగు ..ముత్తిరెడ్డికి టిక్కెట్టే రాదని సొంత పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొన్నటిదాక జనగామ ఇంచార్జ్ గా పార్టీ బాధ్యతలు చూసిన MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డినే..అధిష్టానం జనగామ బరిలోకి దించుతుందనే టాక్ నడుస్తోంది. KTRకు అత్యంత సన్నిహితుడిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి గుర్తింపుంది. KCR పరిశీలనలోనూ పోచంపల్లి పేరే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. జనగామలో పోచంపల్లి కార్యక్రమాలు కూడా పార్టీలో హాట్ టాపిక్  గా మారాయి.

ముత్తిరెడ్డి, పోచంపల్లిది ఒకే సామాజిక వర్గం. హైకమాండ్ దగ్గర ఇద్దరికీ పలుకుబడి ఉంది. కానీ ఇప్పుడు చిన్న బాస్ దే పెత్తనం కావడంతో..జనగామపై పోచంపల్లి కర్చీఫ్ వేశారని టాక్. ఏదోక పేరుతో సర్పంచ్ లు, ఎంపీటీసీల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంట పోచంపల్లి. పార్టీ కార్యక్రమాల్లోనూ కీ రోల్ పోషించే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. లోకల్ లీడర్లకు అభివృద్ది పనుల పేరుతో తన ఫండ్స్ నుంచో..తన పలుకుబడితోనో ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పిస్తున్నారంట. వాళ్లకు కావాల్సిన పనులు చేస్తూ.. తన వైపు తిప్పుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.

 ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మొదటి నుంచి కేరాఫ్ కాంట్రవర్సీ. లేటేస్ట్ గా ఆయన కూతురే ముత్తిరెడ్డిపై కేసు పెట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి..ఆస్తిని అనుభవిస్తున్నారని ఆరోపించారు. తనపై ఫోర్జరీ కేసు పెట్టడాన్ని ప్రత్యర్థుల కుట్రగా చెప్తున్నారు ముత్తిరెడ్డి. తన టికెట్ కు ఎసరు పెట్టినోళ్లే..కూతురితో తనపై కేసు పెట్టించారని తన అనుచరులతో చెప్తున్నాడని టాక్. మీడియా సమావేశంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ముత్తిరెడ్డి.  

పోచారం వ్యవహారాన్ని గతంలోనే హైకమాండ్ ద్రుష్టికి MLA తీసుకెళ్లినట్టు సమాచారం. ఎమ్మెల్యే కంప్లైంట్ తోనే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ గా పంపించారని పార్టీలో చర్చ జరిగింది. అయినా పోచంపల్లి జనగామ రాజకీయాల్లో యాక్టీవ్ గానే ఉన్నారంట. తన నియోజకవర్గంలో వేలుపెడుతున్నా..చిన్న బాస్ కు సన్నిహితుడు కావడంతో పోచంపల్లికి..ముత్తిరెడ్డి గట్టిగా చెప్పలేకపోతున్నాడంట. ఎన్నికల టైమ్ లో ఇదేం లొల్లని టెన్షన్ పడుతున్నారంట జనగామ BRS క్యాడర్.