
‘లోఫర్’ సినిమాతో పూరి జగన్నాథ్ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేసిన దిశా పటాని, ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ తెలుగులో కనిపించలేదు. ఎంఎస్ ధోని, భాగీ2, రాధే లాంటి సినిమాలతో బాలీవుడ్‌లో కొనసాగుతోంది. ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియా ఫాలోయింగ్, డేటింగ్ కబుర్లతో తరచుగా తన పేరు బీటౌన్‌లో వినిపిస్తుంటుంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఆమె ఓ టాలీవుడ్ మూవీలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా రామ్ చరణ్ సినిమాలో. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వాయిదా పడడంతో ఇతర చిత్రాల షూటింగ్స్ పై ఫోకస్ పెట్టాడు చరణ్. ఓ వైపు శంకర్ మూవీ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. మరోవైపు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి మూవీ ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దిశా పటానిని సంప్రదిస్తున్నారట. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావడంతో దిశను అడుగుతున్నారట. ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్‌గా ఉండే దిశకు బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌కూడా బాగా తెలుసు. ఇక గతంలో ‘పుష్ప’ మూవీ ఐటెమ్ సాంగ్ విషయంలోనూ దిశ పేరు వినిపించినా ఫైనల్‌గా సమంత ఆ సాంగ్ చేసింది. ఏదేమైనా వరుణ్ తేజ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని, రామ్ చరణ్ మూవీతోనైనా రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి!