ఇన్​టచ్ సీఓఓ దిశాంత్కు అవార్డు

ఇన్​టచ్ సీఓఓ దిశాంత్కు అవార్డు

హైదరాబాద్, వెలుగు: కస్టమర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ సంస్థ ఇన్‌‌‌‌‌‌‌‌టచ్ సీక్స్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిశాంత్ భోజ్వానీకి గ్రాండ్ స్టీవీ అవార్డు లభించింది. నాయకత్వ పటిమ, భవిష్యత్తు -కేంద్రీకృత వ్యూహానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఈ సంస్థ 2025 ఆసియా - పసిఫిక్ స్టీవీ అవార్డులలో 12 అవార్డులు గెలుచుకుంది.  కస్టమర్ సర్వీస్ లీడర్‌‌‌‌‌‌‌‌షిప్ గ్రాండ్ స్టీవీ అవార్డు అందుకుంది.  దిశాంత్​కు గోల్డ్ స్టీవీ - మోస్ట్ ఇన్నోవేటివ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది ఇయర్, సిల్వర్ స్టీవీ - మోస్ట్ ఇన్నోవేటివ్ లీడర్ ఆఫ్ ది ఇయర్, సిల్వర్ స్టీవీ - మోస్ట్ ఇన్నోవేటివ్ థాట్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు కూడా దక్కాయని కంపెనీ తెలిపింది.