డిస్నీలో 4వేల జాబ్స్​కు కోత

డిస్నీలో  4వేల జాబ్స్​కు కోత

న్యూఢిల్లీ:ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ డిస్నీ  వచ్చేనెల కనీసం 4,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ సంస్థ ఇదే ఏడాది ఫిబ్రవరిలో 7,000 ఉద్యోగులను తీసేసింది.  రాబోయే వారాల్లో తొలగించబోయే ఉద్యోగుల జాబితాలను తయారు చేయాలని సంస్థ ఆదేశాలు జారీ చేసింది. లేఆఫ్​లు బ్యాచ్‌‌‌‌‌‌‌‌ల వారీగా జరుగుతాయా ? ఒకేసారి ఉంటాయా ? అనే విషయమై క్లారిటీ రాలేదు.  

వచ్చే ఏప్రిల్ 3న డిస్నీ వార్షిక సమావేశం జరగనున్న సమయంలో సంస్థ ఉద్యోగాల కోతల గురించి ప్రకటించింది. స్ట్రీమింగ్ సర్వీస్ హులు విషయంలో ఏమి చేయాలనే దాని గురించి ఆలోచిస్తున్నామని తెలిసింది.   డిస్నీ సీఈఓ బాబ్ ఇగెర్ ఈ విషయమై మాట్లాడుతూ సంస్థను పునర్నిర్మించడం, కంటెంట్‌‌‌‌‌‌‌‌ను, ఉద్యోగులను తగ్గించడం ద్వారా బిలియన్ల డాలర్లను ఆదా చేస్తామని అన్నారు.  రాబోయే కొన్ని సంవత్సరాల్లో సుమారుగా  3 బిలియన్ డాలర్లు పొదుపు చేయాలని  డిస్నీ టార్గెట్​గా పెట్టుకుంది.