ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం

ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్  సర్వీసెస్ కు అంతరాయం ఏర్పడింది. ఇవాళ(బుధవారం) ఉదయం నుంచి ట్విట్టర్ నిలిచిపోయింది. లాగిన్ అయితే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. ట్విట్టర్ దీనికి గల కారణాలను తెలిపింది. లోపం ఎక్కడుందో తెలుసుకుని.. దాన్ని పరిష్కరించే పనిలో తమ ఎక్స్ ఫర్ట్స్ పని చేస్తున్నారని… త్వరలోనే తిరిగి సాధారణ స్థితి ఏర్పడుతుందని ట్విట్టర్ వర్గాలు తెలిపాయి. ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ కాలేకపోతున్నామంటూ ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా రిపోర్టులు ట్విట్టర్ కు చేరాయి. ముఖ్యంగా… జపాన్, కెనడా, భారత్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది.