పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు..60 రోజుల్లో ఎన్నికలు

పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు..60 రోజుల్లో ఎన్నికలు

పాకిస్తాన్ లో కీలకపరిణామాలు చేటు చేసుకున్నాయి. ఆగస్టు 9న నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు.  ఆగస్టు12తో పాక్ నేషనల్ అసెంబ్లీ పదవీకాలం  ముగియనుండటంతో అసెంబ్లీ రద్దు తేదీని ప్రధాని ప్రకటించారు. త్వరలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటిస్తుందన్నారు ప్రధాని షెహబాజ్. తాజా పరిణామాలతో పాక్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ రద్దు చేసిన 60రోజులలోపు సాధారణ ఎన్నికలు నిర్వహించాలి.  రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.

ఆగస్టు 9న ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీ రద్దు కోసం రాష్ట్రపతికి అధికారిక సలహా పంపనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, రద్దును అమలు చేయడానికి రాష్ట్రపతి 48 గంటల్లోపు సలహాపై సంతకం చేయాలి. ఏదైనా కారణం చేత రాష్ట్రపతి సలహాపై సంతకం చేయకపోతే, అసెంబ్లీ ఆటోమేటిక్‌గా రద్దు చేయబడుతుందని స్థానిక పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.