లబ్ధిదారులకు నిరాశ..‘డబుల్​’ ఇండ్ల పంపిణీ మళ్లీ వాయిదా

  లబ్ధిదారులకు నిరాశ..‘డబుల్​’ ఇండ్ల పంపిణీ మళ్లీ వాయిదా
  • అర్బన్​లో నేడు జరగాల్సిన లక్కీ డ్రా రద్దు 
  • ఇండ్లకన్నా అర్హుల సంఖ్యే ఎక్కువ
  • 9486 దరఖాస్తుల్లో 3179 మందితో మందితో ఫైనల్​ లిస్ట్​ 

ఆదిలాబాద్, వెలుగు :ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్  రూమ్​ ఇండ్ల పంపిణీ మళ్లీ వాయిదా పడింది. జిల్లా వ్యాప్తంగా  ఇండ్ల నిర్మాణాలు  పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదు.  ఈక్రమంలో అర్భన్​లో  ఇటీవలే లబ్ధిదారులను ఎంపిక చేసి శనివారం డ్రా  తీస్తామని అధికారులు ఊరించారు.  కానీ, అనూహ్యంగా ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని  కూడా రద్దు చేశారు. మళ్లీ  తర్వలో నిర్వహిస్తామని  చెప్పడంతో  లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. 

 ఇండ్ల కన్నా అర్హుల సంఖ్యే ఎక్కువ.. 

 జిల్లా వ్యాప్తంగా 2015jj­,2016 నుంచి విడతల వారీగా 3862 ఇండ్లు మంజూరయ్యాయి.  మొదటి సారిగా ఆదిలాబాద్ అర్బన్ లో అధికారికంగా 982 డబుల్ బెడ్ రూంల పంపిణీ కోసం అధికారులు రెడీ అవుతున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు 982 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా వాటికి 9,486  దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను ఇటీవల అదిలాబాద్ అర్బన్ రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేసి, అర్హులను  గుర్తించారు.  అయితే వచ్చిన దరఖాస్తుల్లో నుంచి  3180 మంది లబ్ధిదారులను  అర్హులుగా తేల్చారు.  అయితే పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్ల సంఖ్య తక్కువగా ఉండటం.. అర్హులైన లబ్ధిదారులు రెట్టింపు ఉండటంతో లక్కీ డ్రా పద్దతిన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 

రంగులు వేసి మమ!

ప్రస్తుతం కేఆర్కే కాలనీ, మావల జాతీయ రహదారి పక్కన ఉన్న ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు.  అయితే కేఆర్కే కాలనీలో ఇండ్లు కలరింగ్ వేసి సిద్ధంగా ఉన్నప్పటికీ అందులో ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. కిటికీల అద్దాలు పగిలిపోయాయి.  స్లాబ్ పెచ్చులూడాయి. వాటర్ ట్యాంక్ పైపులు దెబ్బతిన్నాయి.   మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. విద్యుత్ సరఫరా, తాగునీరు. రోడ్డు, డ్రైనేజీ లాంటి నిర్మాణాలు చేపట్టకుముందే పంపిణీ కి ఏర్పాట్లు చేయడం గమనార్హం.

 సజావుగా సాగేనా..

డబుల్ బెడ్ రూంల పంపిణీ కోసం లక్కీ డ్రా తీయాలని అధికారులు భావిస్తుండగా..  ఎవరికి ఆ దృష్టం వరించనుందోనని ఉత్కంఠ నెలకొంది. అయితే గతంలో డబుల్ బెడ్ రూంల కోసం కొంత మంది లీడర్లు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇండ్లిప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో లక్కీ డ్రా నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఇండ్ల కోసం ముందే డబ్బులు ఇచ్చిన లబ్ధిదారులు తమకే కేటాయించాలని లీడర్ల దగ్గర మొరపెట్టుకుంటున్నారు.  ఇండ్ల కోసం కలెక్టరేట్ ఆఫీసర్లు చుట్టూ ఏండ్ల తరబడి తిరిగిన పేదలందరికి ఇండ్లు వచ్చే పరిస్థితి లేదు. 

త్వరలో లక్కీ డ్రా నిర్వహిస్తాం..

ఆదిలాబాద్ అర్బన్ పరిధిలో డబుల్ బెడ్ రూంల దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించడం జరిగింది. 981 ఇండ్లకు గాను 3180 మంది లబ్ధిదారులు ఉండటం వల్ల లక్కీ డ్రా నిర్వహించి పంపిణీ చేస్తాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలాంటి అవకతవకాలు లేకుండా ప్రక్రియ చేపడుతాం. 
 -సతీశ్​ కుమార్, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్