ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్లో, మండలంలోని మచ్చర్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కు బుక్స్, యూనిఫాం పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. ఆర్మూర్ అర్బన్ లోని జడ్పీ రాంమందిర్ స్కూల్లో, చేపూర్ లోని జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అంకిత్, మండలంలోని మచ్చర్ల జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఎంపీపీ పస్క నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరై
స్టూడెంట్స్కు బుక్స్, యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల దేవి లావణ్య శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, ఎంఈవో పింజ రాజగంగారం, ఎంపీడీవో సాయిరాం, ఐకేపీ గంగారాం, హెడ్మాస్టర్లు చలం, చంద్రశేఖర్ రెడ్డి, పండరి,కిషన్ లు పాల్గొన్నారు.