నానో యూరియాతో మొక్కలకు ఎక్కువ పోషకాలు : డి. పుల్లయ్య

నానో యూరియాతో మొక్కలకు ఎక్కువ పోషకాలు : డి. పుల్లయ్య

మధిర, వెలుగు: నానో యూరియా వాడకం వలన మొక్కకు పోషకాలు ఎక్కువ మోతాదులో అందుతాయని జిల్లా వ్యవసాయ అధికారి ఖమ్మం డి. పుల్లయ్య తెలిపారు.  రైతులకు సిరిపురం గ్రామంలో నానో యూరియా క్షేత్ర ప్రదర్శనను బుధవారం వ్యవసాయాధికారులు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నానో యూరియా వాడకం వలన ఖర్చు తక్కువతోపాటు పర్యావరణ కాలుష్యం కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు.  నానో యూరియాను  ఎంపిక చేసిన కలుపు మందులలో కలిపి పిచికారి చేయవచ్చునని వివరించారు. అనంతరం  మధిర రైతు వేదికలో ఏఈఓ, ఏ ఓ లకు ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మండల సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్ర , వ్యవసాయ అధికారి కే.సాయి దీక్షిత్,  వ్యవసాయ విస్తరణ అధికారులు వేణు, గురుమూర్తి  రైతులు పాల్గొన్నారు.