
- జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య
మధిర, వెలుగు : పచ్చిరొట్ట ఎరువులు వాడకంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. బుధవారం మధిర మండల పరిధిలోని రాయపట్నం గ్రామంలోని పచ్చిరొట్ట వేసిన పొలాన్ని ఆయన సందర్శించారు. పచ్చిరొట్ట ఎరువులతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. సహజసిద్ధంగా పచ్చిరొట్ట వాడకం వల్ల భూమిలో నత్రజని, భాస్వరం, పొటాష్ నిలువలు పెరుగుతాయని తెలిపారు.
నాణ్యమైన విత్తనాలు, రువులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అనంతరం మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. నిబంధనలను పాటించని డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే సాయి దీక్షిత్, ఆత్మ కమిటీ సభ్యుడు గోపాలరావు , డీలర్లు, ఏఈఓలు టి.జిష్ణు, కే గురుమూర్తి, రైతులు పాల్గొన్నారు.