నాగర్ కర్నూల్ జిల్లాలో 6,119 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం : వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు

నాగర్ కర్నూల్ జిల్లాలో 6,119 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం  :  వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో 6,119 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో యూరియా స్టాక్ పాయింట్ ను విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదిహేను రోజులపాటు యూరియా సరిపోతుందని, ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు.

 రైతులు మొక్కజొన్న పంటకు ఎకరాకు ఐదు బస్తాల మోతాదు మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.  యూరియా కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని ఏడీఏ, ఏవోలు యూరియా సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.