వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చూడాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా

వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చూడాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా
  • భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి అర్భన్​, వెలుగు : వేసవిలో మంచినీటి ఎద్దడి ఏర్పడితే ఆఫీసర్లపై  చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. శుక్రవారం ఎంపీడీవోలు, ఆర్ డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఆఫీసర్లు, జీపీ సెక్రటరీలతో కలెక్టరేట్‌‌ లో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..   గ్రామాల్లో మంచినీటి సమస్య వస్తే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు  

ప్రభుత్వం రూ. 3 కోట్ల 91 లక్షలు మంజూరు చేసిందన్నారు.  గ్రామస్థాయిలో మంచినీటి సమస్యల్ని గుర్తించి నివేదికలు అందజేయాలని చెప్పినా కొన్ని మండలాల ఎంపీడీవోలు నిర్లక్ష్యం చేశారని వారిపై  కలెక్టర్  ఆగ్రహం వ్యక్తం చేశారు.  గ్రామాలలో మంచినీటి సమస్య ఏర్పడితే సంబంధిత

ఎంపీడీవోదే పూర్తి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. మలహర్ మండల ఎంపీడీవోకు షోకాజ్ నోటీస్‌‌ జారీ చేయాలని జడ్పీ సీఈఓ కు సూచించారు.  అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.