ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలి : వల్లూరు క్రాంతి

 ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలి : వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు :  ఈవీఎంలపై  పూర్తి అవగా హన కలిగి ఉండాలని  పీవో, ఏపీవోలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం  ఎంఏఎల్డీ కాలేజీలో వారికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ పొందిన అధికారులు పోలింగ్ బూత్ లలో సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నారు.

ఎటువంటి సందేహాలు ఉన్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలన్నారు. ఈవీఎంల కనెక్ట్ నుంచి వాటిని  వాడే విధానంపై పూర్తి  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్  రోజున ఉదయం  6 గంటలకు మాక్  పోల్ నిర్వహించి క్లోజ్ రిజల్ట్  క్లియర్ బటన్  (సీఆర్సీ) అయ్యేదాకా పరిశీలించి తదుపరి  పోలింగ్ మొదలు పెట్టాలన్నారు.  ప్రతి ఒక్కరు ఫారం 12 ఫిలప్  చేసి ఇవ్వాలన్నారు.  కార్యక్రమంలో  మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.