ఫోన్ ట్యాపింగ్ కేసులో జిల్లా లీడర్లను కూడా వదల్లే..

ఫోన్ ట్యాపింగ్ కేసులో జిల్లా లీడర్లను కూడా వదల్లే..

 ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. డీఎస్పీ ప్రణీత్ రావు పోలీసుల విచారణలో కీలక విషయాలు చెబుతున్నారు. ఈ కేసు పై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ డీజీపీని కలవనున్నారు. రాష్ట్ర నాయకుల ఫోన్లే కాకుండా జిల్లాల్లోని లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఆయన అనుమానిస్తున్నారు.  

ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇంకా లోతైన విచారణ జరపాలని ఆయన డీజీపీని కోరనున్నారు. దాంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి యెన్నంకు దగ్గర ఉన్న పలు కీలక ఆధారాలను డీజీపీ అందజించబోతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఫోన్ టాపింగ్ కేసు విచారణ పరిధి, విస్తృతిని పెంచాలని డీజీపీకి వినతి పత్రం అందజేయనున్నారు. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు కాంగ్రెస్ జిల్లా స్థాయి లీడర్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరింత విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నారు.