Shocking Video Viral : దారుణం.. రోడ్డుపై కుక్క పిల్లను బైక్ తో తొక్కించాడు..!

Shocking Video Viral : దారుణం.. రోడ్డుపై కుక్క పిల్లను బైక్ తో  తొక్కించాడు..!

రోడ్డుపై వెళ్తున్న ఓ కుక్క పిల్లను బైక్ తో తొక్కించిన ఘటనకు సంబంధించిన వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బెంగళూరులో ఈ  ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో రోడ్డు మధ్యలో ఓ కుక్క పిల్ల ఉంది.  అటువైపుగా ఓ బైక్ వస్తుంది. బైక్ కు బ్రేకులు పడలేదేమో గాని ఆ బబైక్ ఆ కుక్క పిల్లను తొక్కుకుంటూ వెళ్లింది. బంగి చక్రాల కింద ఆ కుక్క పిల్ల  నలిగి విలవిల కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది.  

ఆ తర్వాత బైక్ నడిపే వ్యక్తి కొద్ది దూరం వెళ్లి ఆగాడు.  ఈ ఘటన సీసీ  కెమెరాలో రికార్డవ్వగా... ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.   ఆ కుక్క పిల్లకు సాయం చేయడానికి స్థానికులు గుమిగూడారు.   రోడ్డు పక్కగా వదిలారు. ఈ వీడియో వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు స్పందించారు.  వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటలన జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు .. బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వర్తూర్ పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.