మహీంద్రా, టాటా కార్లపై దీపావళి డిస్కౌంట్లు

మహీంద్రా, టాటా కార్లపై దీపావళి డిస్కౌంట్లు

సొంత కారు ఉండాలనేది చాలా మంది కల.. కారు కొనేందుకు పండగ ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు.  కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్లు, ఇతర డీల్స్ తో యూజర్లను  ఆకట్టుకుంటాయి. అలాగే ఈ దీపావళికి కూడా వివిధ కంపెనీలు డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు ఇస్తున్నాయి.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

మహీంద్రా XUV400  :  మహీంద్రా తన ఎలక్ట్రిక్ వెహికిల్ సెగ్మెంట్‌లో XUV400 పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. టాటా నెక్సాన్ EV తో పోటీపడుతున్న ఈ కారుపై రూ. 1.50 లక్షల నుంచి రూ. .3.05 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. 

మహీంద్రా XUV300:   మహీంద్రా గ్రూప్ అతి చిన్న SUV XUV300 వేరియంట్‌పై రూ.1.2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ప్రయోజనాలు W8, W6 వేరియంట్‌లపై అందుబాటులో ఉంది. టాప్-ఎండ్ W8 వేరియంట్‌కు రూ.95,000, W6 వేరియంట్ రూ.80,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. 

మహీంద్రా బొలెరో : మహీంద్రా బొలెరో, బొలెరో నియో SUVలపై రూ.70,000 వరకు తగ్గింపులను కంపెనీ దీపావళి నెలలో అందిస్తోంది. B6 వేరియంట్ రూ.35,000 వరకు, బొలెరో కోసం ఎంట్రీ-లెవల్ B4 వేరియంట్ రూ.50,000 వరకు ప్రయోజనాలతో పాటు అదనంగా రూ.20,000 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీస్‌ కంపెనీ అందిస్తోంది.

టాటా టియాగో : టాటా మోటార్స్ దిగ్గజ కార్ మోడల్.. టాటా టియాగో పెట్రోల్ మోడల్‌పైన మొత్తం రూ. 55 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంట్లో రూ. 35 వేలు క్యాష్ డిస్కౌంట్ కాగా.. రూ. 15 వేలు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.