
హైదరాబాద్, వెలుగు: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో దీపావళి స్పెషల్ డీల్స్ అందిస్తున్నట్టు అమెజాన్ తెలిపింది. కర్వాచౌత్, ధంతేరాస్, దీపావళి పండుగల కోసం ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని పేర్కొంది. అమెజాన్లో లక్షకు పైగా వస్తువులపై ధరలు తగ్గాయి. 30 వేల కొత్త వస్తువులు అందుబాటులో ఉన్నాయి.
చాలా వస్తువులపై 80శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. క్యాష్బ్యాక్విలువ రూ. 150 క్యాష్‌బ్యాక్ నుంచి మొదలవుతుంది. యాక్సిస్ బ్యాంక్, ఆర్‌బీఎల్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు, ఐడీఎఫ్‌సీ డెబిట్ కార్డుపై 10శాతం తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడితే 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాను, రూ. 73,999కి, ఐఫోన్ 15ను రూ. 47,999కు, వన్‌ప్లస్ 13ఆర్‌ను రూ. 36,999కు, షియోమీ 55-అంగుళాల క్యూఎల్‌ఈడీ టీవీని రూ. 32,999కు కొనొచ్చు. హోం అప్లయెన్సెస్, ఫ్యాషన్ వస్తువులపై 80శాతం వరకు తగ్గింపు ఇస్తున్నామని అమెజాన్ తెలిపింది.