
న్యూఢిల్లీ: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కెరీర్‌లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. శనివారం రాత్రి జరిగిన జెనీవా ఓపెన్ మెన్స్ ఫైనల్లో జొకోవిచ్ 5–7, 7–6, 7–6తో హుబెర్ట్ హుర్కాజ్పై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. జొకో కెరీర్‌లో ఇది వందో ఏటీపీ టైటిల్ కావడం విశేషం. దీంతో ఓపెన్ ఎరాలో ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
జిమ్మి కానర్స్ (109), రోజర్ ఫెడరర్ (103) ముందున్నారు. ఇవాన్ లెండిల్ (94), రఫెల్ నడాల్ (92) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక నవంబర్ 2023 తర్వాత జొకోవిచ్ నెగ్గిన తొలి టైటిల్ ఇది. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ నెగ్గిన జొకో.. ఓపెన్ ఎరాలో 20 వేర్వేరు సీజన్లలో ట్రోఫీని నెగ్గిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.