జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోరు.. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశం

జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోరు.. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశం

వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సెర్బియా సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వింబుల్డన్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టులో పదేళ్ల ఆధిపత్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. 101 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఐకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టులో తన పేరును అగ్రస్థానంలో నిలిపేందుకు మరో అడుగు ముందుకేశాడు. ఒక్కో పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, ఒక్కో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, ఒక్కో విజయంతో వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గత నాలుగేళ్లుగా ఉన్న డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోదాను కాపాడుకునేందుకు మరింత చేరువగా వచ్చాడు. బలమైన ప్రత్యర్థి ఎదురైనా తన ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్లతో రెచ్చిపోయిన జొకో.. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రిక్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జొకో 6–3, 6–1, 7–6 (5)తో స్టాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. 2013 జులై 7న జొకో చివరిసారి ఆండీ ముర్రే చేతిలో ఓడిన తర్వాత మళ్లీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టులో పరాజయం చవిచూడలేదు. వరుసగా 42 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో గెలిచి సరికొత్త రికార్డును క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 1922లో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు ప్రారంభమైనప్పటి నుంచి ఏ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్ని విజయాలు సాధించలేదు. లెజెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2003–2008), హెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడీ (1927–1938) చెరో 32 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.  

సంప్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు సమం..

గతేడాది ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లో రఫెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడిన జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాజా విజయంతో వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా 31 విజయాలు సాధించిన పీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంప్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1997–2001) రికార్డును సమం చేశాడు. ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎరాలో 41 విక్టరీలతో జొరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1976–1981), 40 విజయాలతో రోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2003–2008) ముందున్నారు. ఇక వావ్రింకాతో 2 గంటలా 7 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొట్టిన జొకో ఒక్క డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 9 బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో నాలుగింటిని కాపాడుకున్నాడు. 38 విన్నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 26 అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 6 ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొట్టిన వావ్రింకా విన్నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (12) కొట్టడంలో ఫెయిలయ్యాడు. 29 అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్లోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6–3, 6–7 (6), 6–3, 7–5తో నికోలస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్రీ (చిలీ)పై, మూడోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (రష్యా) 4–6, 6–3, 6–4, 6–4తో ఫుక్సోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (హంగేరి)పై, జిరి లెహెకా (చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6–2, 7–6 (2), 6–7 (5), 6–7 (9), 6–2తో టామి పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై గెలిచారు. 

ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పోలెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6–2, 7–5తో మార్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్రొయేషియా)పై, రెండో సీడ్​ అరీనా సబలెంకా (బెలారస్​) 6–2, 6–3 బ్లింకోవా (రష్యా)పై విజయం సాధించారు.  ఇతర మ్యాచ్​ల్లో పెట్రా క్విటోవా (చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపబ్లిక్​) 6–3, 7–5తో స్టెవనోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సెర్బియా)పై, హడాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మయా (బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6–2, 6–2తో సిర్సిటి (రొమేనియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. 

బోపన్న జోడీ బోణీ

మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోపన్న–మ్యాథ్యూ ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా) జోడీ.. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోణీ చేసింది. తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోపన్న–ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6–2, 6–7 (5/7), 7–6 (10/8)తో గులెర్మో డురాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–టోమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎట్చెవరి (అర్జెంటీనా)పై నెగ్గి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. 2 గంటలా 12 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండో–ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వయం స్థాయి మేరకు రాణించింది.