కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్రు: డీకే అరుణ

కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్రు: డీకే అరుణ

గద్వాల, వెలుగు: కులాల పేరుతో ప్రజలను వేరు చేసి రాజకీయాలు చేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. ఆదివారం ధరూర్ మండలం వామనపల్లి, రేవులపల్లి, భీంపురం తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గద్వాల నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారో గుర్తించి ఓట్లు వేయాలన్నారు. బీసీలకు బీజేపీ పెద్దపీట వేసిందన్నారు. బీజేపీ అభ్యర్థి బలిగేరా శివారెడ్డి, రామచంద్రారెడ్డి ఉన్నారు.

ALSO READ : బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదు: సంపత్ కుమార్