V6 News

మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చిత్తశుద్ధి లేదు : ఎంపీ డీకే అరుణ

మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చిత్తశుద్ధి లేదు : ఎంపీ డీకే అరుణ
  •     ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ద్వంద్వ విధానాలు అవలంభిస్తోందని, ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లు ఎప్పుడో అమలులోకి వచ్చేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో ఏడు సార్లు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దని, మన్మోహన్ సింగ్ హయాంలో రాజ్యసభలో ఆమోదం పొందినా లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రవేశపెట్టలేకపోయారని మండిపడ్డారు. 

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో బిల్లు తెస్తే, కాంగ్రెస్ దానిని వ్యతిరేకించడం విచారకరమన్నారు.జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.