కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తారన్న వార్తల నడుమ.. 2026 మే 28 (గురువారం) ఉదయం డిప్యూటీ సీఎం డీఏ శివకుమార్ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో భాగంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు.
ఈ భేటీలో డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధరామయ్య కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గురువారం సాయంత్రం 3 గంటలకు సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు.
మరోవైపు కర్ణాటకలో డీకే శివకుమార్ కు మద్ధతుగా పెద్ద ఎత్తున భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. డీకే సీఎం పదవిని అలంకరించబోతున్న క్రమంలో అభిమానులు ప్లెక్సీలను ఏర్పాట్లు చేశారు. బెంగళూరు మెఖ్రీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన భారీ పోస్టర్ వైరల్ గా మారింది.
- డీకే ఇంటి ముందు భారీ ఏర్పాట్లు:
సీఎం గా బాధ్యతలు తీసుకోనున్నారనే సమాచారంతో కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటి ముందు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. మీడియా పాయింట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డీకే ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు, నేతలు, కార్యకర్తలతో డీకే ఇంటిముందు కోలాహల వాతావరణం కొనసాగుతోంది.
- అందుబాటులో లేని గవర్నర్.. రాజీనామాపై ఉత్కంఠ:
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా క్రమంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ఇండోర్ కు వెళ్లారు. అంతకు ముందు బెంగళూరు నుంచి ముంబై వెళ్లిన గవర్నర్.. ఇండోర్ కు వెళ్లారు. అయితే సీఎం రాజీనామా ఇవ్వనున్న క్రమంలో గవర్నర్ లేకపోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో గవర్నర్ లేకపోయినా.. ఆయన కార్యాలయంలోనే రాజీనామాను సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
#WATCH | A poster of Karnataka Deputy CM and KPCC president D.K. Shivakumar comes up at Mekhri Circle in Bengaluru, amid specualtions around CM post in the state. pic.twitter.com/uETRTkTqGi
— ANI (@ANI) May 28, 2026
