ఐపీఓకి ముందు లెన్స్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌లో డీమార్ట్ దమానీ పెట్టుబడి..

ఐపీఓకి ముందు  లెన్స్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌లో డీమార్ట్ దమానీ పెట్టుబడి..

న్యూఢిల్లీ: ఐపీఓకి రావాలని ప్లాన్ చేస్తున్న  లెన్స్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌లో డీమార్ట్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాధాకిషన్ దమానీ రూ.90 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.  ఈ కంపెనీ ఐపీఓకి సంబంధించి వచ్చే వారం ఒక క్లారిటీ వస్తుంది. 

ఈ పబ్లిక్ ఇష్యూలో  రూ.2,150 కోట్ల విలువైన ఫ్రెష్‌‌‌‌‌‌‌‌ షేర్లను జారీ చేయాలని కంపెనీ చూస్తోంది. అలాగే ప్రమోటర్లు, పెట్టుబడిదారులు కలిపి 13.22 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) కింద విక్రయించనున్నారు. ఈ ఓఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో ప్రమోటర్లు పీయూష్ బన్సాల్‌‌‌‌‌‌‌‌, నేహా బన్సాల్‌‌‌‌‌‌‌‌, అమిత్ చౌదరి, సుమీత్ కపాహితో పాటు ఎస్‌‌‌‌‌‌‌‌వీఎఫ్‌‌‌‌‌‌‌‌2 లైట్‌‌‌‌‌‌‌‌బల్బ్‌‌‌‌‌‌‌‌, స్క్రోడర్స్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌, పీఐ ఆపర్చునిటీస్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌, మాక్రిట్చి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌, కేదార క్యాపిటల్‌‌‌‌‌‌‌‌, ఆల్ఫా వేవ్ వెంచర్స్ పాల్గొంటున్నాయి. 

ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను  స్టోర్ల ఏర్పాటుకు, లీజు, రెంట్, లైసెన్స్ ఖర్చులకు, టెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, బ్రాండ్ ప్రమోషన్, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని లెన్స్‌‌‌‌‌‌‌‌కార్ట్ ప్రకటించింది.  2008లో ఏర్పాటైన ఈ కంపెనీ 2010లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌గా మారింది. 2013లో ఢిల్లీలో మొదటి ఫిజికల్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. మొత్తం స్టోర్ల సంఖ్య రెండువేలకు చేరింది. సౌతీస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.