ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలి : డీఎంహెచ్‌‌‌‌ఓ డాక్టర్ సీహెచ్ ధనరాజ్

ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలి : డీఎంహెచ్‌‌‌‌ఓ డాక్టర్ సీహెచ్ ధనరాజ్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని డీఎంహెచ్‌‌‌‌వో  డాక్టర్ సీహెచ్ ధనరాజ్ అన్నారు. గురువారం పుల్లూరు, నారాయణరావుపేట, చింతమడక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆరోగ్య కేంద్రాల్లో  నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరును పరిశీలించారు. ల్యాబ్ లో నిర్వహిస్తున్న పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వ్యాధుల తీవ్రతను బట్టి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కుక్క కాటు, పాము పాముకాటుకు సంబంధించిన వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.  డాక్టర్లు వినోద్ బాబ్జి, బాపిరెడ్డి, భాస్కర్, సిబ్బంది నవీన్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.